Sunday, July 19, 2009

అలరులు కురియగ

రాగం: శంకరాభరణం

29 ధీర శంకరాభరణం మేళ
ఆ: స రి గ మ ప ద ని స
అవ: స ని ద ప మ గ రి స

తాళం: ఆది
రచన: అన్నమాచార్యుడు
భాష: తెలుగు

పల్లవి

అలరులు కురియగ ఆడెనదె అలకల కులుకుల అలమేల్మంగ

చరణం 1

అరవిరి సొబగుల అతివలు మెచ్చగ అరతెర మరుగున ఆడెనదే
వరుసాపూర్వ దువాళపు తెరుపుల హరిగరగెంపుచు అలమేల్మంగా

చరణం 2

మట్టపు వలపుల మట్టెకలపుల తట్టది నడపుల దాటెనదె
పెట్టిన వజ్రపు పెండిపుతలుకులు అట్టిటు చిమ్ముచు అలమేల్మంగ

చరణం 3

చిందుల పాటల సిరిపొలయాటల అందెలమూటల ఆడెనదె
కందువ తిరు వేంకటపతి మెచ్చగ అందపు తెరుపుల అలమేల్మంగ

No comments: