Wednesday, December 09, 2009

సీతాపతి నా మనసున




రాగం: ఖమాస్
28 హరికాంభోజి జన్య
ఆరోహణ: స మ గ మ ప ద ని స
అవరోహణ: స ని ద ప మ గ రి స

తాళం: దేషాది
రచన: త్యాగరాజ


పల్లవి

సీతాపతి నా మనసున సిద్ధాంతమని ఉన్నానురా

అనుపల్లవి

వాతాత్మజాదుల చెంతనే వర్ణించిన నీ పలుకులెల్ల

చరణం

ప్రేమ జూచి నాపై పెద్ద మనసు జేసి నీ మహిమలెల్ల నిండార జూపి
ఈ మహిని భయమేటి కన్న రామచంద్ర త్యాగరాజ వినుత

No comments: