Tuesday, March 09, 2010

ఎక్కడి మానుష జన్మంబు



రాగం: బౌళి
తాళం: చతురశ్ర ఏకం
రచన: అన్నమాచార్య

పల్లవి:

ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ..నీ చిత్తంబికనూ

||ఎక్కడి||

చరణం 1:

మరువను ఆహారంబును,మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియభోగము మాధవ నీ మాయా ||మరవను||
మరచెద సుజ్ఞానంబును, మరచెద తత్వరహశ్యము ||మరచెద||
మరచెద గురువును దైవము మాధవ నీ మాయా

||ఎక్కడి||

చరణం 2:
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా ||విడువను||
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును ||విడిచెద||
విడిచెదనాచారంబును విష్ణుడ నీ మాయా

||ఎక్కడి||

చరణం 3:
తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా ||తగిలెద||
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై ||అగపడి||
నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయా


No comments: